ఢిల్లో వాయు కాలష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ కాలుష్యం తగ్గించేదుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో పాటు పాఠశాలకు వారం పాటు సెలవులు, ఈనెల 17 వరకు భవన నిర్మాణ పనులు ఆపేయాలంటూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలతో అయినా ఢిల్లీలో వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గుముఖం పడుతుందని అంచానా వేస్తుంది. సుప్రీం కోర్ట్ కూడా పంట వ్యర్థాలు తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
తాజాగా దేశంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న పట్టణంగా ఢిల్లీ సరిహద్దు నోయిడా పట్టణం నిలిచింది. ఈ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 464 గా ఉండి అత్యంత కాలుష్య పట్టణంగా కొనసాగుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాలుష్యానికి కారణమవుతున్న 8 కారకాలపై రూ. 66 లక్షల జరిమానా విధించింది.
దీంతో పాటు గ్రేటర్ ఢిల్లీలోని ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, గ్రేటర్ నోయిడాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వరుసగా 441, 441, 423, 464, 408గా నమోదైంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, వజీర్‌పూర్, ఓఖ్లా, రోహిణి, నరేలాలలో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం వరుసగా 450, 453, 452, 460, 427 ,414గా ఉంది