అద్బుతం: చంద్రయాన్ – 3 ప్రయోగం జరిగేది అప్పుడే… ?

-

భారతదేశంలో ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎన్నో రాకెట్ లను ప్రయోగించి చరిత్రపుటల్లోకెక్కారు. తాజాగా మరో ప్రయోగం చేయడానికి ఇస్రో టీం సిద్ధంగా ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రయాన్ ప్రయోగాన్ని వచ్చే నెలలో అనగా జులై 12 నుండి 18 తేదీల మధ్యన ప్రయోగించనున్నారని తెలియచేసింది. కాగా ఈ ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 615 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టును GSLV M – 3 లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా చేయనున్నారు. కాగా ఇంతకు ముందు ఆల్రెడీ ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ లో లాగే ల్యాండర్ , రోవర్ లు ఉంటాయట. కానీ ఒక్క మార్పు ఏమిటంటే… ఇందులో ఆర్బిటర్ ఉండదు. ఇక గతంలో చంద్రయాన్ 1 ను 2008 లో, చంద్రయాన్ 2 ను 2019 లో ప్రయోగించారు.

ఇక నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు చంద్రయాన్ 3 ను ప్రయోగిస్తున్నారు. మరి ఈ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news