వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ రూ.50 వేలు…కేంద్రం ఉద్యోగులకి తీపికబురు చెప్పనుందా..?

-

కరోనా మహమ్మారి వలన చాలా మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రొం హోమ్ ని కూడా మొదలు పెట్టాయి. దీనితో ఇళ్ల నుండే ఉద్యోగస్తులు పని చెయ్యాల్సి వుంది. దీంతో దాదాపు కంపెనీలు చాలా వరకు ఖర్చును తగ్గించుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో చూస్తే వర్క్ అంతా ‘హైబ్రిడ్ మోడల్’లోకి మారేలా కనపడుతోంది. ఇది ఇలా ఉంటే ఉద్యోగులకి కూడా ఇళ్ల నుండి పని చేయడం వలన ట్రావెల్ చార్జెస్ వంటివి కలిసి వస్తున్నాయి.

టైం కూడా సేవ్ అవుతోంది. అయితే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అదనంగా ఇతర ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఇంటర్నెట్, టెలిఫోన్ బిల్లులు వంటి ఖర్చులు ఉద్యోగులకి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలానే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రత్యేకంగా ఒక సెటప్ చేసుకోవాల్సి కూడా వస్తోంది. పైగా ఎక్కువ స్పేస్ వున్న ఇళ్ళని అద్దెకి తీసుకోవాలి కనుక అద్దె రేటు కూడా పెరిగిపోతోంది.

ఫర్నీచర్, చెయిర్స్, కంప్యూటర్ యాక్ససరీస్ మొదలైనవి కూడా కొనుగోలు చెయ్యాల్సి వస్తోంది. ఈ ఖర్చులను కంపెనీల నుంచి రియంబర్స్‌మెంట్ చేసుకోవడం, ప్రాక్టికల్‌గా చూస్తే కాస్త కష్టంగానే ఉంటోంది. అందుకనే రాబోతున్న బడ్జెట్‌పై వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పన్ను లెక్కింపులలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం డిడక్షన్స్‌ను కావాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను కవర్ చేసేందుకు ఎలాంటి డిడక్షన్ లేదు.

కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు దానిని తీసుకు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. లేదు అంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్‌నైనా తీసుకు రావాలని అనుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అదనపు డిడక్షన్‌గా రూ.50 వేలు ఇవ్వాలని డెలాయిట్ ఇండియా కూడా అంటోంది. ప్రీ బడ్జెట్ మెమోరాండంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కింద ఉద్యోగులకు పన్ను ఊరటను కల్పించాలని ఐసీఏఐ అంటోంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతమున్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news