యాపిల్‌కు చెందిన ఐఫోన్లను భారత్‌లోని పలు పరిశ్రమల్లో తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో ఉన్న నరసపుర ఇండస్ట్రియల్ ఏరియాలో విస్ట్రాన్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమకు చెందిన హెడ్ క్వార్టర్స్ తైవాన్‌లో ఉన్నాయి. అయితే ఈ పరిశ్రమలో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తారు. కాగా పరిశ్రమకు చెందిన కార్మికులు శనివారం భీభత్సం సృష్టించారు.
విస్ట్రాన్ పరిశ్రమలో కార్మికులు తమకు కంపెనీ సరిగ్గా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ పరిశ్రమంలో విధ్వంసానికి పాల్పడ్డారు. పరిశ్రమలోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిశ్రమలో ఆఫీసులపై రాళ్లు రువ్వాలు. దీంతో గోడలకు అమర్చిన అద్దాలు పగిలాయి. అయితే ఈ విషయంపై స్థానిక కార్మిక నేతలు మాట్లాడుతూ తాము కాంట్రాక్టు కార్మికులమే అయినా కంపెనీ తమ జీతం నుంచి అన్నింటికీ కోత విధిస్తుందని, అయినప్పటికీ యాజమాన్యం సకాలంలో జీతాలను ఇవ్వడం లేదని తెలిపారు.
కాగా విస్ట్రాన్ కంపెనీలో యాపిల్‌కు చెందిన ఐఫోన్ 7 ఫోన్లతోపాటు లెనోవో, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలకు చెందిన ఐటీ ప్రొడక్ట్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తారు. అయితే ఆ విధ్వంసంలో భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ పరిశ్రమ యాజమాన్యం కూడా ఈ విషయంపై స్పందించలేదు.