భారత్ జీడీపీ 7.5 శాతం ఉండొచ్చు : ప్రపంచ బ్యాంకు

-

ప్రపంచ బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7.5 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక పరిణామాల తాజా నివేదికలో పేర్కొంది. ఇంతకుముందు భారత్ జీడీపీ 8 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కాగా, తాజా ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-2023 మార్చి)లో భారత్ పట్ల తన అంచనాలను సవరించడం ఇది రెండోసారి.

World Bank cuts India's FY22 GDP growth drastically to 8.3% - BusinessToday

గత ఏప్రిల్ లో భారత్ జీడీపీని 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఇప్పుడా శాతాన్ని మరికాస్త తగ్గిస్తూ 7.5 గా పేర్కొంది. 2022 ప్రథమార్థంలో భారత ఆర్థిక కార్యకలాపాలను కొవిడ్ సంక్షోభం ప్రభావితం చేసిందని, ఆపై ఉక్రెయిన్ యుద్ధం ప్రతికూలంగా మారిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news