నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రపంచ బాక్సింగ్ విజేత

-

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు రానున్నారు. తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలకనున్నట్లు సమాచారం.

నిఖత్ జరీన్
నిఖత్ జరీన్

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్స్ లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిటిపాంగ్‌ను 0-5 తేడాతో బంగారు పతకాన్ని సాధించారు. దీంతో మేరీకోమ్, జెన్నీ, సరితా దేవి, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్ నిలిచింది.

2022 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే అంటాల్యలో జరిగిన 2011 ఏఐబీఏ మహిళలు యూత్ అండ్ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే గౌహతిలో జరిగిన రెండో ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె కాంస్యం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news