ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ అనంతరం అన్ని పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే భేటీ పూర్తి కాగా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. అదే సమయంలో తనను ఆంధ్రప్రదేశ్ లో అడుగు కూడా పెట్టనివ్వకుండా సరిహద్దుల్లోని ఆపారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు సైఫ్ దాడి చేయని పార్టీ లేదు, అచ్చెన్నాయుడు నుండి చంద్రబాబు వరకు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలను సృష్టిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రాష్ట్రంలో అస్థిరత లేదు.. అందుకే సుస్థిరతను సాధించి పెట్టడానికి టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యాం అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు.
పదవులు అంటే ఆశపడని నిస్వార్ధ రాజకీయ నాయకులం మేము… రాష్ట్ర అభివృద్దే మాకు ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చాడు. ఇక గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చింది అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలి అని కోరుకున్నాను కాబట్టే అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్.