WORLD CUP 2023: బంగ్లాతో ఇంగ్లాండ్ “ఢీ”… గెలుపే లక్ష్యంగా బట్లర్ సేన !

-

వరల్డ్ కప్ 2023 లో ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ లు తలపడనుండగా మధ్యాహ్నం మ్యాచ్ లో శ్రీలంక మరియు పాకిస్తాన్ లు పోటీ పడనున్నాయి. అందులో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుని ఛేజింగ్ కె మొగ్గు చూపింది. వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కివీస్ పై ఓటమి పాలవడంతో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అందుకే జట్టులో కూడా ఒక కీలక మార్పును చేసింది ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం. గత మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లు పెద్దగా రాణించింది లేదు. అందుకే వారికి తోడుగా మరో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ను జట్టులోకి తీసుకుంది. మొయిన్ ఆలీకి బదులుగా రీస్ టాప్లె జట్టులోకి వచ్చాడు. తన యొక్క ఇన్ స్వింగ్ మరియు అవుట్ స్వింగ్ బౌలింగ్ తో వికెట్లు తీయగల సత్తా ఉంది.

మరి ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ రాతను మర్చి టోర్నీలో మొదటి విజయాన్ని అందిస్తాడా చూడాలి. కాగా మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయాన్ని సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news