ముంబై లో ఇండియా క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడి ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు అభేద్యమైన టార్గెట్ ను ఉంచింది. ఇండియా నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది, కేవమా మూడు పరుగుల దూరంలో 400 మార్క్ ను చేరుకోవడంలో నిలిచిపోయింది. ఇండియాలో కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (105), గిల్ (79) లు రాణించారు. కింగ్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్ ద్వారా చాలా రికార్డ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వన్ డే లలో అత్యధిక సెంచరీ ల రికార్డును అధిగమించి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ ముందు ఉంచిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందా అంటే సందేహమే అని చెప్పాలి.
ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో ఇండియా బౌలింగ్ ఏ విధంగా ఉందంటే, ప్రత్యర్ధులు అందరినీ ఆల్ అవుట్ చేస్తూ బెస్ట్ బౌలింగ్ అటాక్ గా పేరు తెచ్చుకుంది. మరి న్యూజిలాండ్ ను ఓడించి ఇండియా ఫైనల్ కు చేరుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.