WORLD CUP 2023 : కివీస్ ముందు స్వల్ప లక్ష్యం… తోకముడిచిన బంగ్లా పులులు !

-

ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా చెన్నై లోని చెపాక్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన షకిబుల్ సేన నిర్ణీత ఓవర్ లలో బ్యాటింగ్ కు అంతగా సహకరించని పిచ్ మీద 9 వికెట్లు నష్టపోయి 245 ఒక మాదిరి స్కోర్ చేశారు.. ఈ స్కోర్ లో రహీం (66), మహ్మదుల్లా (41), షకీబ్ (40) మరియు మెహిదీ హాసన్ (30) లు తలో చెయ్యి వేశారు. మరో 30 నుండి 40 పరుగులు చేసుంటే డిపెండ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ కివీస్ పేస్ ముందు బంగ్లా పులులు తూక మూడవక తప్పలేదు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ మూడు, హెన్రీ, బౌల్ట్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్లకు సహరిస్తుందనుకున్న ఈ పిచ్ మీద కివీస్ స్పిన్నర్ లు చెందింది ఏమీ లేదు.. కేవలం మిచెల్ ఒక్క వికెట్ మరియు ఫిలిప్స్ ఒక్క వికెట్ తీసుకున్నారు.

కాగా న్యూజిలాండ్ ఈ స్కోర్ ను ఛేదిస్తుందా లేదా ఏమైనా సస్పెన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news