హైదరాబాద్ లో ఈ రోజు పాకిస్తాన్ మరియు శ్రీలంక ల మధ్యన మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక పాక్ ముందు భారీ టార్గెట్ 345 ను ఇచ్చింది. అనంతరం ఛేదనలో పాకిస్తాన్ ఆరంభంలోనే తడబాటుకు గురయ్యి వెంట వెంటనే రెండు కీలక వికెట్లను కోల్పోయి ప్రమాదకర స్థాయిలో పడింది. దాదాపు ఓటమి కోరల్లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ ను రిజ్వాన్ మరియు అబ్దుల్ షఫీక్ లు చాలా నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ ను సేఫ్ లోకి తీసుకువచ్చారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు ఏకంగా 176 పరుగులు చేసి పాకిస్తాన్ ను చాలా ప్రమాదకర స్థితిలో నుండి బయట పడేశారు. ఇక షఫీక్ అయితే ఓపెనర్ గా వచ్చి అద్భుతమైన సెంచరీ చేసి జట్టును విజయపధంలో నడిపించారు.
ఇతను 103 బంతుల్లో 10 ఫోర్లు మరియు 3 సిక్సులతో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలంటే ఆఖరి 15 ఓవర్లలో 115 పరుగులు చేయాల్సి ఉంది.