దశల వారీగా మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఆదిమూలపు సురేష్

-

కృష్ణా జిల్లాలో చివరి చుక్క కూడా సాధించే వరకూ పోరాటం చేస్తామని, కృష్ణా మిగులు జలాలతో చేపడుతున్న ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల ఆఖరికి వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దశల వారీగా మధ్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని, ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

Minister Audimulapu Suresh welcomes SC judgement

20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాంలో ఆయన పాత్ర స్పష్టమని, ఇవి రాజకీయ ప్రేరేపిత కేసులు కావు.. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. కేసుల రద్దుకు, బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా ఏమయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఈరోజు కేసులు వచ్చాయంటే ఎలా అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news