కాసేపటి క్రితమే ముగిసిన వరల్డ్ కప్ మ్యాచ్ లో శ్రీలంక నెదర్లాండ్ పై మరో ఓవర్ నాలుగు బంతులు మిగిలి ఉండగా అయిదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి టోర్నమెంట్ లో బోణీ కొట్టింది. వాస్తవంగా ఈ మ్యాచ్ ను లంకేయులు ఎప్పుడో ముగించాల్సింది.. క్నీ నెదర్లాండ్ శ్రీలంకకు చాలా గట్టి పోటీ ఇవ్వడంతో ఇంతవరకు వచ్చింది. నెదర్లాండ్ ఇచ్చిన 263 పరుగులు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో శ్రీలంక మొదట్లోనే పెరీరా వికెట్ను కోల్పోయింది… ఆ తర్వాత ఇన్నింగ్స్ ను స్టడీ చేసే బాధ్యతను మెండిస్ నిస్సంకలు తీసుకున్నారు. అయితే నెదర్లాండ్ బౌలర్లు పుంజుకుని మెండిస్ నిస్సంకలను అవుట్ చేసింది. కానీ సమరవీర (91) మరియు అసలంక(44) లు పరిస్థితులకు తగినట్లుగా ఆడి విజయాన్ని అందించారు. ఈ విజయంతో శ్రీలంక నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది.
ఇక నెదర్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకే విజయంతో ఎనిమిదవ స్థానంలో ఉంది.