పోలీస్ అమరవీరుల దినోత్సవం.. ఏపీ సీఎం జగన్ ట్వీట్

-

విధి నిర్వహణలో అమరులు అయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరఫున నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడికి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇస్తున్నట్టు పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు.

<img src="https://manalokam.com/wp-content/uploads/2023/09/CM-Jagan-will-inaugurate-the-pump-house-at-Lakkasagaram-today.jpg" alt="CM Jagan will inaugurate the pump house at Lakkasagaram today" width="600" height="338" class="size-full wp-image-548082" /

సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాటయోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవాల్సిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది నేర నిరోధం నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news