ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో న్యూజిలాండ్ మరియు నెథర్లాండ్ జట్ల మధ్యన కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నెథర్లాండ్ ముందు 323 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నెథర్లాండ్ బ్యాటింగ్ చేస్తూ ఇప్పటికే నాలుగు కీలక ప్లేయర్ల వికెట్లను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నెథర్లాండ్ విజయానికి చేరువ కావాలంటే ఓవర్ కు 9 కి పైగా పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో 16 వ ఓవర్లోని నాలుగవ బంతికి నెథర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ డి లీడ్ రవీంద్ర బౌలింగ్ లో భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా సిక్సు వెళ్లబోయే బంతిని బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చాలా అద్భుతమైన డైవింగ్ తో గాల్లోకి ఎగిరి బంతిని ముందులా చాలా చాకచక్యంగా బౌండరీ అవతల నుండి నెట్టేశాడు..
ఆ తర్వాత చాలా కంట్రోల్ తో మళ్ళీ బౌండరీ ఇవతలికి వచ్చి క్యాచ్ ని అందుకుని అద్భుతమైన ఫీల్డింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. డి లీడ్ కనుక అవుట్ కాకపోతే నెథర్లాండ్ పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉండేది. కానీ అతన్ని బౌల్ట్ అవుట్ చేయడం ద్వారా ఈజీ గా ఉంది..