ప్రపంచ మలేరియా దినోత్సవం… చరిత్ర.. విశేషాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు..

-

ప్రస్తుతం ప్రపంచం ప్రాణాంతకమైన కరోనా వైరస్ తో పోరాడుతుంది. మొదటి వేవ్ దాటి వచ్చాక మళ్లీ సెకండ్ వేవ్ అంటూ విజృంభిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచమంతా పోరాటం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరాల్లో వచ్చిన అనేక వ్యాధులను విస్మరించలేం. అలాంటి వాటిల్లో మలేరియా ఒకటి. పరాన్నజీవి కారణంగా వచ్చే ఈ వ్యాధి చాలా మందిని పొట్టన బెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 6లక్షల కి పైగానే మలేరియా కారణంగా మృత్యువాత పడ్డారు.

ఇందులో ఎక్కువ శాతం ఆఫ్రికన్ దేశస్తులే ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీని మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మలేరియా మీద అందరికీ అవగాహన కల్పించడం కోసం, ఈ వ్యాధిని తరిమేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ తెలుసుకోవడం కోసం మలేరియా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2007 మే నెలలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సభలో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసారు. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన మలేరియా దినోత్సవాన్ని జరుపుతున్నారు.

ముందుగా ఇది ఆఫ్రికా దేశాల మలేరియా దినోత్సవంగా ఉండేది. దాన్నే ప్రపంచ మలేరియా దినోత్సవంగా మార్చారు.

2021మలేరియా సంవత్సరం థీమ్ ఏంటంటే,

ప్రపంచంలో మరెక్కాడా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుండా చూసుకోవడం. మలేరియా వ్యాధిని అరికడుతున్న దేశాల విజయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుకుంటుంది. ఈ దేశాలు మరెన్నో దేశాలకి ప్రేరణగా నిలుస్తాయి.

మలేరియా ఎలా వస్తుందంటే,

ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల మలేరియా వ్యాపిస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమకాటు కారణంగా ఇది వస్తుంది. అందుకే ఇంటి చుట్టుపక్కల, పనిచేసే స్థలాలని శుభ్రంగా ఉంచుకుని దోమలు ఉండకుండా జాగ్రత్త పడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version