వరల్డ్ పాపులేషన్ డే..ప్రతి సంవత్సరం జూలై 11 న జరుపుకుంటారు.ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక రోజును జరుపుతారు.
వివరాల్లొకి వెళితే..ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు మొట్టమొదటిసారి 1989 జూలై 11న ‘వరల్డ్ పాపులేషన్ డే’ జరుపుకోవడం విశేషం. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకోగా.. ఈ రోజును ప్రత్యేకంగా గుర్తించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అప్పటి నుంచి 2007 జూలై 11 వరకూ.. 20 ఏళ్లలో ప్రపంచ జనాభా ఊహించని స్థాయిలో పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది..
అదే విధంగా..ఈరోజు తెలంగాణ ఇంజనీర్స్ డే కూడా ఈరోజే కావడం విశేషం..ఈరోజు తెలంగాణ వ్యాప్థంగా ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు.. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు ‘అలీ నవాజ్ జంగ్ బహదూర్’ (1877 జూలై 11) జన్మదినాన్ని పురష్కరించుకుని 2014లో ఈ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది…ఈరోజును కూడా ఘనంగా జరుపుకుంటున్నారు..