తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇలాగే కురుస్తాయని వెల్లడించింది. అయితే.. వానల ప్రభావంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. భారీ వర్షాలు వస్తుండటంతో లింగపల్లి-హైదరాబాద్ మధ్య ఎంఎంటీఎస్ రాకపోకలను నిలిపివేసింది దక్షిణ మధ్య రైల్వే.
ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. మొత్తంగా 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దుచేసింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రభుత్వం మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.