చాల మంది పచ్చిబఠాణీలను చాల తేలికగా తీసేస్తుంటారు. చాల మంది పచ్చిబఠాణీ కంటే ఎక్కవగా ఎండు బఠానీలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. శీతాకాలంలో ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ, బంగాళ దుంప, పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు. కానీ అందరికి తెలియని విషయం ఏమిటంటే పచ్చిబఠాణీ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పచ్చిబఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్- A , C , K లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠాణీల్లోనీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ముఖ్యం ఇందులో కార్బోహైడ్రేట్స్,నేచురల్ షుగర్ లెవల్స్, స్ట్రార్చ్ పుష్కలంగా ఉంటుంది.
అంతేకాదు.. పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇన్సులినను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం.
ఇక బఠానీలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది . ఎముకలకు బలం చేకూర్చుతుంది. ఆర్థరైటిస్, ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిబటానీల్లో విటమిన్ కె, బి పుష్కలంగా ఉండి ఇది స్ట్రాంగ్ హెల్తీ బోన్స్ ను ప్రమోట్ చేస్తుంది.