మీ పేరులో ప్రభావం చూపే అక్షరాలేంటో తెలుసా?

-

సాధారణంగా  పేర్లు దేవుళ్లయో, మన పూర్వీకులయో లేక ఈ మోడ్రన్‌ జనరేషన్‌లో అయితే ఏ సెలబ్రిటీలవో పెట్టుకుంటారు. ప్రముఖుల పేర్లను కూడా పెట్టుకోవడం చూశాం. కానీ, ఈ పేర్లలో ఉండే అక్షరాలు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. అవును మతం ఆధారంగానో లే దా వారి జన్మనక్షత్రాలకు తగ్గట్టు పెడతారు. మీ పేరులోని కంపనాలు పేరులోని ప్రతి అక్షరానికి దాని సొంత ప్రకంపనాలు ఉంటాయి. అవి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. జననం నుంచి మరణం వరకు మనలో మారనిది ఒకేఒకటి పేరు.

వ్యక్తి ఆత్మ కూడా పేరుతో ముడిపడి ఉంటుందని అంటారు. పేరు మన విశ్వాసన్ని, విజయం, జీవితం నిర్ణయిస్తుంది. D,M,T– అక్షరాలు ఉన్నవారు కష్టపడి పని చేస్తారు. వ్యాపారాలు చేస్తారు.E,N,H లేదా X, ఈ, ఎన్, హెచ్‌ పేరులో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. V,Uలేదా W కలిగి ఉంటే మానవత్వం కలిగినవారు. వారు సాయం చేసే తత్వం ఉండేవారు. అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది. అక్షరాలుA,I,J,Y లేదా Q ఈ అక్షరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే స్వేచ్ఛను కోరుకుంటారు. ఆశయం కలిగిన వారవుతారు. B,R లేదా K,B,Rఉన్నవారు ప్రకృతి ప్రియులు, జీవితంలో అభద్రతగా ఉంటారు కావున ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు.C,G,S లేదా L‌ మీ పేరులో ఉంటే జ్ఞానం ఉన్నవారవుతారు. ప్రేమించే తత్వం ఉన్నవారు, అలాగే వారికి సంగీత ప్రతిభ ఉంటుంది. O లేదా Z మీ పేరులో ఉంటే మతపరమైన పని, దాతృత్వంలో పాలుపంచుకోవాలి. మొండి పట్టుదల ఉన్నవారవుతారు. అక్షరాలు P లేదా F, అక్షరాలు ఉన్నవారు వారి జీవితంలో విజయం సాధించేవారు, ప్రతిభావంతులు అవుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news