వావ్; కరోనా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడిన కుక్క…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు భయపెడుతున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. పలు దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. మన దేశంలో కూడా దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. ఎక్కడ అనుమానం వచ్చినా సరే పరిక్షలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. తైవాన్ దేశంలో ఒక మహిళ చైనాలో వైరస్ పుట్టిన వుహాన్ నగరానికి వెళ్లేందుకు సిద్దమైంది. అయితే ఆ మహిళ పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రీవర్ కిమి అనే కుక్క తన యజమాని పాస్‌పోర్ట్‌ను వుహన్‌కు విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు నమిలి నాశనం చేసింది. దీనితో ఆమె ప్రయాణం రద్దు అయింది. దీనిపై స్పందించిన సదరు మహిళ కీలక వ్యాఖ్యలు చేసారు.

“నా పాస్‌పోర్ట్ చిరిగినట్లు చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కొన్ని రోజుల తరువాత వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నేను చూశాను.” అని మీడియాకు చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఆ కుక్క మీ ఒక్క కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా కాపాడిందని ఆ కుక్కకు మీరు రుణపడి ఉండాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ వైరస్ మృతుల సంఖ్య వందకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news