టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత రెజ్లర్ రవి దహియా టోక్యో ఒలంపిక్స్ లో తన సత్తాను మరోసారి చాటాడు. రెజ్లింగ్ లో 57 కిలోల విభాగంలో రవి దహియా ఫైనల్ పోరుకు చేరుకున్నాడు. సెమీస్ పోరులో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖరులో అతన్ని పూర్తిగా అడ్డుకోవడంతో విజయం రెజ్లర్ రవి దయ సొంతమైంది.
ఈ విజయంతో భారత్ కు కనీసం రజతం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫైనల్ పోరులో రెజ్లర్ రవి దహియా గెలుపు ఖరారు అయితే గోల్డ్ పతకం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పోరు రవి దహియా కు పెద్ద సవాళుతో కూడుకున్న పని అని నిపుణులు అంటున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్ సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలైంది. ఓటమి పాలైనప్పటికీ లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. బలింపిక్స్ లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. దీంతో లవ్లీనా కాంస్య పతకానికే పరిమితమైంది.