విజ్యువల్ వండర్ KGF2కు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యశ్, శ్రీనిధిశెట్టి హీరో, హీరోయిన్స్ కాగా, కీలక పాత్రలను రవీనాటండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ పోషించారు.
కేజీఎఫ్ స్టోరిలో కీ రోల్ అయిన పవర్ ఫుల్ లీడర్…రమీకా సేన్ గా బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రవీనా టండన్ నటించారు. KGF2 పిక్చర్ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీటు అంచుల్లోకి వచ్చి ఉంటారని సినీ పరిశీలకులు అంటున్నారు. అది నిజమే.. థియేటర్ల వద్ద జనాలను చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇక కీలకమైన సీన్లు వచ్చినపుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని చెప్పొచ్చు.
KGF2 సినిమా భారత చిత్ర సీమకు సరికొత్త దిశా నిర్దేశం చేసింది. జనాలను థియేటర్ బాట పట్టించడంతో పాటు సినిమాను సెలబ్రేట్ చేసుకునే సంస్కృతిని మరలా పరిచయం చేసింది. అలా ఈ చిత్రంలో కీలకమైన సీన్ వచ్చినపుడు రవీనా టండన్ టాకీసు తెరమీద కనబడగానే డబ్బుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఇందుకు సంబంధించిన వీడియోను రవీనా టండన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది.
సదరు వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. ఇంత ప్రేమ కనబరుస్తున్న సినీ ఆడియన్స్ కు థాంక్స్ చెప్పింది రవీనా టండన్. చాలా కాలం తర్వాత తాను ఇటువంటి విజ్యువల్ చూశానని, కర్నాటకలోని ఓ టాకీసులో జరిగిన ఈ విషయం గురించి తెలిపింది రవీనా టండన్. ప్రేక్షకులు వెండితెరపైన రవీనా టండన్ కనబడగానే కాయిన్స్ విసిరేయడం మనం వీడియోలో చూడొచ్చు.
ఈ సీన్ గురించి తన పోస్టులో వివరించింది రవీనా టండన్.. అంతులేని ప్రేమను తనపై కనబరుస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూనే..తను KGF2 సినిమాలో నటించిన చివరి షాట్ ఇదేనని , ఘుస్ కే మారెంగే.. స్వీట్ మొమెరీస్ హ్యాష్ ట్యాగ్ లతో వీడియో షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్లు, సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CchSkLZJqfS/?utm_source=ig_web_copy_link