ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో ఇండియాను వణికిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ కోవిడ్ సూపర్ వేరియంట్ XBB15 తెలంగాణకు కూడా చేరుకుంది.
యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల వేవ్ వెనుక ఉన్న ఈ కరోనా సూపర్ వేరియంట్ కేసులు తెలంగాణలో కూడా నమోదు అయ్యాయి.
రాష్ట్రంలో 3 XXB15 పాజిటివ్ కేసులో నమోదైనట్లు తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ నుంచి జనవరి 2 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం ఆరు XXB15 కేసులు నమోదు అవ్వగా, మూడు తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.