చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్​పింగ్ ఎన్నిక.. పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం

-

చైనా అధ్యక్షుడిగా షీ జిన్​పింగ్​ మూడోసారి ఎన్నికయ్యారు. జిన్​పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా అమోదించింది​. అంతకుముందే గతేడాది జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. అత్యంత అరుదైన ఈ ఎన్నికతో.. మావో జెడాంగ్‌ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా నిలిచారు జిన్​పింగ్(69)​.

వాస్తవానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్​పింగ్ కొనసాగుతున్నారు. ఒక వ్యక్తి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news