షావోమీ నుంచి కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ అయిపోయింది. షావోమీ 12టీ సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా.. షావోమీ 12టీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఈ డేటాబేస్‌లో కనిపించిందని తెలుస్తోంది. ఇందులో 3.19 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ చిప్‌సెట్ ఉండనుంది.
ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించనున్నారు. షావోమీ 12టీ ప్రోలో 12 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.
షావోమీ స్మార్ట్ ఫోన్ 22081212UG మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. ఇది షావోమీ 12టీ ప్రో గ్లోబల్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ గీక్‌బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 1,300 పాయింట్లు, మల్టీకోర్ టెస్టులో 4061 పాయింట్లను సాధించింది.
ఇదే వెబ్‌సైట్ సింగిల్ కోర్ టెస్టులో 753 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 2,990 పాయింట్లను షావోమీ 12టీ సాధించింది.
షావోమీ 12టీ ప్రో అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్లోంది.
దీని ధర కూడా 649 యూరోలుగానూ అంటే సుమారు రూ.51,500గా ఉండొచ్చు..
షావోమీ 12టీ ప్రో ధర 849 యూరోలుగానూ సుమారు రూ.67,000గా ఉండనుంది.
షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా అంటే సుమారు రూ.1,06,200గా, ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ సుమారు రూ.1,18,000గా ,12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ సుమారు రూ.1,41,600గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.