వంశీ కామెడీ చూశారా… జ‌గ‌న్‌తో పోలిక పెట్టుకుని…!

-

గ‌న్న‌వ‌రంలో రెండోసారి గెలిచిన వంశీ తాను చంద్ర‌బాబు, లోకేష్ కంటే గొప్ప‌వాడిని అన్న అర్థం వ‌చ్చేలా మాట్లాడి.. టీడీపీని, చంద్ర‌బాబును ఛీకొట్టేసి జ‌గ‌న్ చెంత ఊగిస‌లాడుతూ చేరిపోయారు. వంశీ మొన్న ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం గ్రేటే అయినా మెజార్టీ వెయ్యిలోపే.. అది కూడా చ‌చ్చీచెడి గెలిచిన‌ట్టే. ఏదో అదృష్టం బాగుండి రెండోసారి గెలిచిన వంశీ ఇప్పుడు చంద్ర‌బాబును, లోకేష్‌ను తిట్ట‌డంలో మంత్రి కొడాలి నానితో పోటీప‌డుతున్నారు. ఇక గ‌తంలోనూ వంశీకి జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు, లింకులు ఉన్నాయి. 2014 ఎన్నిక‌ల ముందే వంశీ జ‌గ‌న్ చెంత‌కు చేరాల‌ని చూశాడు.. ఆ ఎన్నిక‌ల్లో వంశీ వైసీపీలోకి వెళ్లి ఉంటే ఖ‌చ్చితంగా విజ‌య‌వాడ ఎంపీయో లేదా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సీటో వ‌చ్చేది.

ఇక ఇప్పుడు టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కావ‌డంతో పాటు జ‌గ‌న్‌తో ఉన్న పాత ప‌రిచ‌యాలు, క‌మ్మ వ‌ర్గం, అటు మంత్రి కొడాలి నాని అండ ఉండ‌డంతో వైసీపీలోనూ గ‌న్న‌వ‌రంలో పెత్త‌నం నాదే ఉంటుంద‌ని అనుకున్నారు. వంశీపై గ‌త ఎన్నికల్లో పోటీ చేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆయ‌న గ‌న్న‌వ‌రంలో జెండా ఎత్తేశారు. అయితే ఇప్పుడు ఇదే వంశీపై 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన దుట్టా రామ‌చంద్ర‌రావు వంశీకి బ్రేకులు వేస్తున్నారు.

దుట్టా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. పైగా ఆయ‌న అల్లుడు శివ‌భ‌ర‌త్ రెడ్డిది జ‌గ‌న్‌ది ఒకే సామాజిక వ‌ర్గం. జ‌గ‌న్‌తో ఉన్న బంధుత్వాలు వాడుకుని లోక‌ల్‌గా వంశీ వ్య‌తిరేక వ‌ర్గాన్ని క‌లుపుకుని వంశీకి చెక్ పెడుతున్నారు. ఇక ప్రెస్‌మీట్లు పెట్టి చంద్ర‌బాబు, లోకేష్‌ను ఎన్ని తిట్లు తిట్టినా స్థానిక వైసీపీ కేడ‌ర్‌లో చాలా మంది వంశీని త‌మ నాయ‌కుడిగా ఆహ్వానించ‌లేక‌పోతున్నారు. దీంతో చివ‌ర‌కు గ‌న్న‌వ‌రం వైసీపీకి తానే నాయ‌కుడిని అని ప్ర‌క‌టించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యంలో వంశీ త‌న‌ను జ‌గ‌న్‌తో పోల్చుకోవ‌డంతో వైసీపీ శ్రేణులు కూడా ఇంత‌కు మించిన కామెడీ ఏం ఉంటుంద‌ని సెటైర్లు వేస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీకి జగన్ ఒక్కరే నాయకుడని, గన్నవరంలో కూడా ఒకరే నాయకుడని చెప్పుకోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే గ‌న్న‌వ‌రం వైసీపీలో ప‌ట్టుకోసం ఆయ‌న ఎంత కిందామీదా ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతోంది. ఇక దుట్టా, యార్ల‌గ‌డ్డ వ‌ర్గాల‌ను క‌లుపుకుని వెళ‌తానంటూనే.. వారిద్ద‌రు ప్ర‌జా జీవితంలో లేర‌ని.. వారి వల్ల పార్టీకి ఏం న‌ష్టం లేద‌ని చెప్పుకుంటున్నారు. వంశీ బీరాలు ఇలా ఉంటే గ‌న్న‌వ‌రంలో దుట్టా, యార్ల‌గ‌డ్డ వ‌ర్గాలు చెల‌రేగ‌డం వెన‌క వారికి అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. మ‌రి వంశీ ఈ టైంలో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో సీటు ద‌క్కించుకుని వైసీపీ త‌ర‌పున గెలిస్తే త‌ప్పా ఆయ‌న్ను ఇక్క‌డ పార్టీ నేత‌లు గుర్తించే ప‌రిస్థితి లేదు.

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Latest news