షియోమీ ఎంఐ దివాలీ సేల్‌.. కేవ‌లం రూ.1 కే ఫోన్ల‌ను కొనే అవ‌కాశం..

-

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు బిగ్ బిలియ‌న్ డేస్‌, గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా మొబైల్స్ త‌యారీదారు షియోమీ కూడా శుక్ర‌వారం నుంచి ఎంఐ దివాలీ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా షియోమీకి చెందిన ఫోన్లు, ఇత‌ర ప్రొడ‌క్ట్స్ ను త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ప‌లు ఆఫ‌ర్లు కూడా ల‌భిస్తున్నాయి.

xiaomi started diwali with mi sale

ఎంఐ దివాలీ సేల్‌లో ఎంఐ పే తో షియోమీ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. సేల్‌లో ఎంఐ స్టోర్ యాప్‌లో ప‌ఠాకా ర‌న్ ఆడ‌డం ద్వారా రూ.1 కోటి వ‌ర‌కు విలువైన కూప‌న్ల‌ను గెలుచుకోవ‌చ్చు. అలాగే రూ.1 ఫ్లాష్ సేల్‌ల‌ను కూడా షియోమీ నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ లో ఎంపిక చేసిన ఫోన్ల‌ను కేవ‌లం రూ.1కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

షియోమీ ఎంఐ 10, రెడ్‌మీ నోట్ 9 ప్రొ, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 9 ప్రైమ్‌, రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్‌, రెడ్‌మీ 8ఎ డ్యుయ‌ల్‌, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఎ ప్రొ (43), ఎంఐ టీవీ 4ఎక్స్ (50), ఎంఐ టీవీ స్టిక్‌, ఎంఐ బాక్స్ 4కె, ఎంఐ స్మార్ట్ వాట‌ర్ ప్యూరిఫైర్ (ఆర్‌వో+యూవీ), ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2సి, ఎంఐ హోం సెక్యూరిటీ కెమెరా 360 డిగ్రీలు 1080పి, ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 త‌దిత‌ర అనేక ప్రొడ‌క్ట్స్‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు.

యాక్సిస్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాల‌తో ఎంఐ ఇండియా భాగ‌స్వామ్యం అయింది. దీంతో ఆయా బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో అద‌న‌పు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. ఈజీ ఈఎంఐ స‌దుపాయం కూడా ల‌భిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news