Yadadri : ఈనెల 21 నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

-

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. పునర్నిర్మితమైన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రివేళ ఎదుర్కోలు వేడుక, 28న రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం, మార్చి 1న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.

అదే నెల 3న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే శతఘటాభిషేకంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ క్షేత్రానికి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సింహ వాహనోత్సవం, శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలును కనులపండువగా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news