యదాద్రి పున : ప్రారంభ తేదీలు ప్రకటించిన సీఎం కేసీఆర్!

-

మహా పుణ్యక్షేత్రమైన యాదాద్రి నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం తేదీలు ఖరారు అయ్యాయి. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ తేదీలను కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. మార్చి 28 వ తేదీ 2022 వ సంవత్సరం లో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొమ్మిది రోజుల ముందు మహా సుదర్శన యాగం తో అంకురార్పణ జరుగుతుందని తెలిపారు సీఎం కేసీఆర్.

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయ తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియా తో మాట్లాడుతూ.. యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ తేదీలను ప్రకటించారు. విద్వత్ సభ ఈ తేదీలను నిర్ణయించిందని…. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పారు. స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. 125 కిలోల బంగారం ఇందుకు అవసరమని .. దీనికోసం రిజర్వు బ్యాంకు దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేయబోతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news