ఏపీ అప్పు రూ. 7లక్షల కోట్లకు చేరుతోంది : యనమల

-

ఏపీ అప్పులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మొత్తం అప్పు రూ7లక్షల కోట్లకు చేరుతోందని.. 2020-21 జీఎస్డీపి మైనస్ 2.58 శాతం మేర తిరోగమనంలో ఉందన్నారు. పేదలు, సామాన్యుల బతుకు దుర్భరంగా మారిందని.. ఏపీలో ఆర్ధిక అసమానతలు 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని ఫైర్ అయ్యారు. రెండున్నరేళ్ల జగన్ పాలనా నిర్వాకాలతో ఏపీ అధఃపాతాళానికి చేరిందని.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్ధిక అస్థిరత నుంచి బైటపడి, రెండంకెల వృద్ధి సాధించేందుకు.. జగన్ ప్రభుత్వ కార్యాచరణను గ్రీన్ పేపర్ ద్వారా బైటపెట్టాలని పేర్కొన్నారు. ద్రవ్యలోటును రెవిన్యూ లోటు అధిగమించడం.. కనీవినీ ఎరుగం, ప్రపంచంలో ఎక్కడా చూడలేదని.. మార్కెట్ రుణాలను, ఆఫ్ బడ్జెట్ అప్పులు మించిపోవడం.. విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఓటిఎస్ పేరుతో హౌసింగులో బలవంతపు వసూళ్లకు తెగబడ్డారని అగ్రహించారు. ఎడాపెడా పన్నుల వాతలు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే..రెండున్నరేళ్లలోనే తీవ్ర క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. ఉద్యోగులకిచ్చిన హామీలను బంగాళాఖాతంలో కలిపేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news