GHANI : మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. “గని” మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

-

మెగా హీరో వరుణ్ తేజ్.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్… ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల కావలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల.. సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 18 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news