రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయా పార్టీల నాయకులు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమావేశం అయ్యారు. అలాగే విపక్ష పార్టీలు కూడా సమావేశమయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు. శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తృణమూల్‌కు యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు.
విపక్షాల భేటీకి టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాకు సుధీర్ఘ అనుభవం ఉంది. చంద్రశేఖర్, వాజ్‌పేయీ పీరియడ్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. అలాగే ఆర్థిక, విదేశాంగ శాఖల్లో విధులు నిర్వహించారు. యశ్వంత్ సిన్హా బీహార్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. బీజేపీకి రాజీనామా చేసి ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును అన్ని పార్టీలు ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.