ఈ తరం బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే: యువరాజ్ సింగ్

-

వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్లు ఎవరంటే మనకి టక్కున గుర్తుచే పేర్లు విరాట్, రోహిత్, స్టీవ్‌ స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్ . వీరి లో ఎవరు బెస్ట్ క్రికెటర్ అంటే మాత్రం కొంచెం ముందు వెనుక ఆలోచించాల్సిందే.అయితే, ఈ తరం బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీనేనని మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ వెల్లడించాడు. వచ్చే వరల్డ్ కప్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు .జూన్ నుంచి ప్రారంభం కానున్న పొట్టి కప్‌ విరాట్ కోహ్లీకి ఆరోది. తొలిసారి 2012 ఎడిషన్‌లో ఆడాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీనే.

ఎవరు కాదన్నా సరే.. ప్రస్తుత తరానికి అన్ని ఫార్మాట్లలో అతడే బెస్ట్‌ బ్యాటర్. విరాట్ కోహ్లీ ఆటను అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. క్రీజ్‌లో చివరివరకూ అతడు ఉన్నాడంటే.. మ్యాచ్‌ను ముగించగల సత్తా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో విరాట్ ఒంటరిగానే ఇండియాను గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఒక్కసారి కుదురుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా టీమ్‌ఇండియా ఛేదించినట్లే అని తెలిపారు

.

Read more RELATED
Recommended to you

Latest news