సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో సోమవారం సచివాలయంలో మంత్రి మండలి సమావేశం అయ్యింది. కేబినెట్ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలపైనే చర్చించనున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కల్పించాల్సిన వసతులు, మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూ, మరికొన్ని అత్యవసర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొన్న అధికారులను సైతం ఈ భేటీలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది.