ఏపీలో పారదర్శక పాలన చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం జగన్‌కు కంట్లో నలుసుగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. గత పాలకులకు భిన్నంగా తన పాలన ఉంటుందని పదే పదే చెపుతున్న సీఎం జగన్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నానని నిరూపించారు. తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే అని తన సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే అరెస్ట్‌తో జగన్ సర్కారు తేటతెల్లం చేసింది. ఓ మహిళా అధికారిని ఫోనులో బెరించాడని, ఆమేను ఇబ్బందులకు గురిచేసాడని అధికారి పోలీసులకు పిర్యాదు చేసిన 24గంటల్లోగా ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం చూస్తుంటే సీఎం జగన్ తన సొంత పార్టీ ప్రజాప్రతినిధులైనా సరే చట్టం ముందు సమానమే అనే సంకేతాలు ఇచ్చింది. ఇటు జగన్ నిర్ణయం సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చింది.
ఇప్పుడు సీఎం జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించడం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించినా కూడా అదే ఎమ్మెల్యే సీఎం నిర్ణయాన్ని స్వాగతించడం ఇక్కడ హర్షించదగ్గ విషయం. పారదర్శక పాలన అందించేందుకే తనని అరెస్ట్ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించి సీఎం జగన్‌పై ఉన్న విశ్వాసాన్ని చాటుకున్నారు.
వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి కేసులో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కోటంరెడ్డి ని అరెస్టు చేస్తారంటూ వార్తలు రావటంతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు శనివారం అర్ధరాత్రి దాటాక భారీగా వైసిపి కార్యకర్తలు చేరుకోవటంతో అరెస్టు ను అడ్డుకొనేలా హైడ్రామా చోటు చేసుకుంది. కోటంరెడ్డి నివాసముండే చిల్డ్రన్స్ పార్కు వద్దనున్న సాయి ఆశ్రయ అపార్ట్‌మెంట్ కు పోలీసులు చేరుకుని దాదాపు గంటసేపు చర్చించారు. అనంతరం ఆయన పోలీసులతో కలసి బైటకొచ్చి మీడియాలో మాట్లాడుతూ తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లాననడం అబద్దమని అయినా తను దాడి చేసానని కేసు పెట్టడం ఏంటని కోటంరెడ్డి నిలదీసారు.
ఈ విషయంలో తన తప్పేమీ లేదన్న ధైర్యంతో తను ఉన్నానని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. అనుమతులు ఉన్నా ఎంపీడీవో వాటర్ కనెక్షన్ ఉద్దేశ పూర్వకంగానే ఇవ్వలేదని ఆ ఆరోపించారు. ఏది ఏమైనా పారదర్శకత పాలన అందించేందుకే తనని అరెస్టు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తనపై జరుగుతున్న కుట్ర కోణాన్ని ఆరా తీయాలని పోలీసులను కోరుతున్నానని, తను తప్పు చేసినట్టు విచారణలో తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఇప్పుడు కోటంరెడ్డి అరెస్ట్‌తో ప్రతిపక్షాల నోటికి తాళం పడినట్లే..