ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా నెల్లూరు సిటీ లో ఎవరు గెలుస్తారని ప్రముఖ నాయకులు చర్చించుకుంటూ ఉంటారు. కాగా గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణ పై గెలుపొందిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ఇక్కడ పోటీ మరింత హోరా హోరీగా సాగనుంది. ఈ మధ్యనే నారాయణ నెల్లూరు లో అడుగు పెట్టారు, ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. కాగా నారాయణపై వైసీపీ నేతలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. తాజాగా నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనారిటీ నేత సమీర్ ఖాన్ నారాయణపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ మైనారిటీ నేత: కోటంరెడ్డికి నెలకు రూ. 20 లక్షలు జీతం ఇస్తున్న మాజీ మంత్రి నారాయణ !
-