వినుగొండ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. వరికి గిట్టు బాటు ధర లేదని… వైసీసీ సర్కార్ ఏర్పాటు చేసిన ఆర్‌బీకే ల ద్వారా కొనడం లేదని.. ఓ అదే నియోజక వర్గానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గ్రామానికి వచ్చిన నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎదుట ఆ రైతు వాపోయారు. అయితే.. అదే సమయంలో.. స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు.. ఆ రైతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఎంపీ ఎదుటే తన కాలికి ఉన్న చెప్పుతో… రైతును కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే… సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినుగొండ నియోజక వర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో.. వైసీపీ కి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోయారు. అయితే.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు లావు కృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు..వచ్చారు. ఈ నేపథ్యంలోనే.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.