పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు…!

పరీక్షల్లో కాపీ కొడుతూ వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఒకరు దొరికిపోయారు. పీజీ వైద్య పరీక్షల్లో బ్లూటూత్‌ తో కాపీయింగ్‌ కు పాల్పడ్డ వైసిపి ఎమ్మెల్యే కొడుకును వర్సిటీ అబ్జర్వర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతనిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతల ఒత్తిళ్లు మొదలయ్యాయి. మెడికల్‌ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి తో ఒత్తిడి చేస్తున్నారు. విచారణకు కమిటీతో కూడా వేసారు.AP PG Medical Admission 2020 - Check Dates, Application (Closed)

ఈ నెల 22న విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొడుకు హాజరు అయ్యే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన పరీక్షల్లో అతను దొరికిపోయాడు. జనరల్ సర్జన్ లో ఫెయిల్ అయిన మరో ఇద్దరు పీజీ విద్యార్దులు కూడా ఉన్నారు. ఇద్దరిని పాస్ చేయాలని యూనివర్శిటి అధికారుల పై మరో ముఖ్యనేత ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.