ఇప్పటికే యూరప్ దేశం కరోనా వైరస్ కేసులతో వణికిపోతోంది. కరోనా వైరస్ ధాటికి యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. అంతే కాదు ఇప్పటికే సెకండ్ వేవ్ ప్రారంభమైనట్టు ప్రకటించాయి. తాజాగా, బెల్జియంలోనూ కరోనా కేసులు మళ్ళీ వెల్లువలా వచ్చి పడవచ్చని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బార్లు, రెస్టారెంట్లను నెలరోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాకుండా రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. మార్చి నెలలో కరోనా తీవ్రతను భారీగా ఎదుర్కొన్న బెల్జియం.. తాజాగా మరోసారి ఈ వైరస్ తీవ్రతను ఎదుర్కొంటోందని చెప్పచ్చు. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో చాలా ఆసుపత్రుల్లో నాన్ ఎమర్జెన్సీ సర్వీసుల్ని నిలిపివేశారు. ఆసుపత్రులన్నీ కొవిడ్ రోగులతోనే నిండిపోతున్నాయి. ఇక ఈ సెకండ్ వేవ్ టెన్షన్ అయితే అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సెకండ్ వేవ్ బారిన పడద్దని చాలా దేశాలు కోరుకుంటున్నాయి.