గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది.
వైసీపీ ఎంపి మాగుంట కొడుకు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్సార్ ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు. మాగుంట రాఘవను అరెస్ట్ చేసిన ఈడి.. ఢిల్లీకి తీసుకుపోయినట్లు సమాచారం అందుతోంది. అలాగే మధ్యాహ్నం కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.