కెసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్టీ జాబితాలో మరో పదకొండు కులాలను చేర్చాలని అసెంబ్లీ తీర్మానించింది. సేమ్ కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకాగ్రీవంగా ఆమోదించింది.
వాల్మీకి బోయ, బెడర్, కిరాతక, నిషాద్, తలయారి, పెద్ద బోయలు, చుండువాళ్లు, కాయితి లంబాడాలు, బాట్ మధురాలు, చమరు మధురాలను ఎస్టీలుగా గుర్తించాలన్న ఎస్టీ విచారణ సంఘం 2016 లో ఇచ్చిన సిఫారసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించింది కేసీఆర్ సర్కార్. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఈ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.