పోలవరం అక్రమాలపై కేంద్రమంత్రికి ఎంపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ/అమరావతి: కేంద్రమంత్రి గజేందర్ సింగ్‌ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. లబ్దిదారులను పక్కన పెట్టి నకిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. కేటాయింపులు 25 శాతం పెంచి కమీషన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేందర్ సింగ్‌ను ఆయన కోరు. గత నెల 14న ఏపీ సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని తెలిపారు. పోలవరం అక్రమాలు, తనపై దాడి వివరాలను రెండు వేర్వేరు లేఖలను కేంద్రమంత్రికి అందజేశారు.

కాగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఎంపీ రాఘురామకృష్ణంరాజుపై ఇటీవల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన వివిధ రాష్ట్రాలు, ఎంపీల మద్దతు కూడగడుతున్నారు. తాజాగా ఆయన కేంద్రమంత్రిని కలిసి పోలవరం నిర్వాసితుల పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.