జులై 8వ తేదీ, మరియు 9 వ తేదీల్లో మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశంపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సామాజిక విప్లవానికి తెర తీసే విధంగా జగన్ పాలన ఉందన్నారు. సామాజిక అంశాలను పరిశీలించి వెనుక పడిన కులాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో జరుగుతున్న ప్లీనరీ అని పేర్కొన్నారు వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
ప్లీనరీకి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారని.. దీనిలో వేరే ఆలోచన అవసరం లేదని పేర్కొన్నారు. శాశ్వత అధ్యక్షుడు అనే సవరణ చేస్తే విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారన్నారు.
ఈ అంశం పై సీఎం జగన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని… ఈ ప్లీనరీలో ప్రజల ఆశలకు, గత మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనేది చర్చిస్తామని వెల్లడించారు వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మార్పులు అవసరమైతే తీసుకోవటానికి వెనకడుగు వేయబోమని.. 15 వరకు తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందన్నారు.