భీమవరం రాగలిగే దమ్ముందా?.. ప్రధాని మోడీకి వైసీపీ ఎమ్మెల్సీ సవాల్

-

ప.గో : కాళ్ల మండలం పెదఅమిరంలో జరిగిన వైఎస్ఆర్సిపి ప్లీనరీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. భీమవరం జులై 4న ప్రధాని నరేంద్రమోడీ వస్తున్నారని.. నరేంద్ర మోడీ దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు…మన స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు ఆయనకు ఉందా.. అని నిలదీశారు.

మన స్టీల్ ప్లాంట్ అమ్మి ..భీమవరం రాగలిగే దమ్ముందా? మీరురానీస్తారా అని అడుగుతున్నానని ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా కావాలి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పినవాళ్ళు బీజేపీ వాళ్లని..కానీ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహించారు.

బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకున్నవాళ్లు పవన్ కల్యాణ్ గారని.. బీజేపీ గానీ పవన్ కల్యాణ్ గానీ ఆంధ్రప్రదేశ్లో తిరిగే నైతిక హక్కు ఉందా.. అని ప్రశ్నించారు. ప్రధాని భీమవరం వచ్చినపుడు నల్ల జెండాలను చూపిస్తే ఆంధ్రా వాళ్ల సెంటిమెంట్ అర్థమౌతుందని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news