తిరుమలకి సంబంధించి రోజుకొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొడాలి నాని వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పటి దాకా ప్రతిపక్షాన్ని, చంద్రబాబుని టార్గెట్ చేసిన ఆయన నిన్న మోడీ మీద ఆయన భార్య అంటూ చేసిన కామెంట్స్ రచ్చ రేపాయి. ఈ కామెంట్లపై వివాదం పెరుగుతుండడంతో వైసీపీ నష్టనివారణ చర్యలకు దిగింది. డిక్లరేషన్ వ్యవహారం విషయాన్ని ప్రస్తావించకుండానే నరేంద్ర మోడీపై నాని చేసిన కామెంట్లను పార్టీ తప్పు పట్టింది. కొడాలి నాని విపక్షాల ట్రాప్ లో పడ్డారని వైసీపీ నేత, ప్రభుత్వ సలహా డారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీడియా వాళ్ళు చెప్పాకే ప్రధానిపై నాని ఏవో వ్యాఖ్యలు చేశారని తెలియదని ఆయన అన్నారు. మోడీ గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదన్న ఆయన నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు. ఇక కొడాలి నాని కామెంట్స్ మీద బీజేపీ రచ్చ చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం చేపట్టింది.