షాకింగ్ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలెట్ బాక్స్ లను తగలెట్టేశారు !

Join Our Community
follow manalokam on social media

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండ వలస గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నేలకోన్న్నాయి. అక్కడ స్వాతంత్ర అభ్యర్ధి గెలిచినట్టు ప్రకటించడంతో కొంతమంది వైసీపీకి చెందిన మద్దతుదారులు పోలింగ్ సిబ్బంది నిర్బంధించి బాలట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి తగలబెట్టారు. దీంతో పోలీసులు వారి మీద లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ గ్రామంలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసిపి మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

బాలట్ బాక్స్ లు ఉన్న వాహన డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయడంతో ఆయన మీద వైసిపి మద్దతుదారులు దాడి చేశారు. దీంతో ఆయన కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత గ్రామంలోకి బెటాలియన్‌ను రంగంలోకి దించారు. అలా ఎట్టకేలకు  కొండవలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళన చేస్తున్న వైసీపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే వైసీపీ మద్దతు ధరలు తీసుకెళ్లినా బ్యాలెట్ బాక్సుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఇక ఇప్పటికే పూర్తిగా కాలిపోయిన రెండు బ్యాలెట్ బాక్సులను పోలీసులు గుర్తించారు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...