కుప్పంలో బాబుకు భారీ షాకిచ్చిన వైసీపీ

Join Our Community
follow manalokam on social media

చిత్తూరు జిల్లాలోని కుప్పంలో అంటే సొంత నియోజకరవర్గంలోనే చంద్రబాబు కు భారీ షాక్ తగిలింది. నిన్న మూడో విడత ఎన్నికలలో భాగంగా నియోజకరవర్గంలో మొత్తం 89 పంచాయతీలలో పోలింగ్ జరగగా అందులో వైసిపి 74 స్థానాలు దక్కించుకొని చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చింది. కేవలం 14 చోట్ల టిడిపి అభ్యర్థులు గెలుపు సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు. అయితే చాలా చోట్ల టిడిపి మద్దతుదారులు డిపాజిట్లు కోల్పోవడంతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.

ఇక చంద్రబాబు సొంత స్థానం అయిన కుప్పం నియోజకవర్గంలో సింహ భాగం సర్పంచ్ స్థానాలను సాధించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి..అయితే చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోలేక పోయారు అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వైసీపీ సర్కార్ కావాలనే ఫోకస్ చేసి మరీ తమ అభ్యర్థులను గెలిపించుకుందని చెబుతున్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....