నేడు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం.. బహిష్కరించి కుటుంబాలతో సహా రోడ్డెక్కనున్న ఉద్యోగులు !

-

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది. ఈరోజు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం కాగా ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మిక సంఘాలు బహిష్కరించాయి. మధ్యాహ్నం కూర్మన్నపాలెం గేటు దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కుటుంబాలతో సహా పాల్గొనాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. దీంతో ఈ రోజు కుటుంబాలతో సహా ఉక్కు ఉద్యోగులు, కార్మిక సంఘాలు రోడ్డెక్కనున్నారు.

ఇక గాజువాకలో భారీ నిరసన ప్రదర్శన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నిన్న స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కార్మిక సంఘాల నాయకులతో నిన్న చర్చించిన ఆయన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకవైపున చేయాల్సినవన్నీ చేస్తాం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం పెడతామని తెలిపారు. అలానే కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంటు మూతబడింది, ఉత్పత్తి సరిగ్గా జరగడంలేదన్న మాట రానీయకుండా చూసుకోండి అని జగన్ సూచనలు చేశారు. విరామం సమయంలో మాత్రమే ధర్నాలు, ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు

Read more RELATED
Recommended to you

Latest news