YCP’s sensational allegation on Bandaru Shravani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత… వైసిపి నేతలను టార్గెట్ చేసి జైల్లో వేస్తున్నారు. కొంతమందిపై కేసులు కూడా పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు.. వైసిపి సోషల్ మీడియా ఎత్తు గడలు వేస్తోంది.ఇందులో భాగంగానే టిడిపి మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి పార్టీ.
టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండారు శ్రావణిపై సంచలన పోస్ట్ పెట్టింది వైసీపీ. టీడీపీ కార్యకర్తకే ఎమ్మెల్యే శ్రావణి వెన్నుపోటు పొడిచిందంటూ చురకలు అంటించింది వైసీపీ. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునే రూ.5 లక్షలకి అమ్ముకున్నారంటే.. కూటమి నేతల దందాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోందంటూ సెటైర్లు పేల్చింది వైసీపీ పార్టీ. సంపద సృష్టిస్తానన్నావ్.. ఇలానేనా చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
టీడీపీ కార్యకర్తకే ఎమ్మెల్యే శ్రావణి వెన్నుపోటు
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునే రూ.5 లక్షలకి అమ్ముకున్నారంటే.. కూటమి నేతల దందాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది
సంపద సృష్టిస్తానన్నావ్.. ఇలానేనా @ncbn ?#IdhiMunchePrabhutvam#SadistChandraBabu#MosagaduBabu pic.twitter.com/WK6QFfk3RL
— YSR Congress Party (@YSRCParty) December 20, 2024